close

క్రైమ్

పరీక్ష కిట్ల అక్రమాలపై దర్యాప్తు ముమ్మరం

అనిశా కస్టడీకి ఐఎంఎస్‌ నిందితులు

ఈనాడు, హైదరాబాద్‌: బీమా వైద్య సేవలు(ఐఎంఎస్‌) విభాగం కుంభకోణంలో భాగంగా వైద్య పరీక్ష కిట్ల సరఫరా పేరిట జరిగిన అక్రమాలపై అవినీతి నిరోధక శాఖ దర్యాప్తు ముమ్మరం చేసింది. కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించే నెపంతో కిట్లను సరఫరా చేసినట్లు బోగస్‌ ఇండెంట్లు సృష్టించి రూ.కోట్లు కొట్టేసినట్లు అనిశా గుర్తించిన విషయం తెలిసిందే. హెచ్‌ఐవీ రోగ నిర్ధారణ పరీక్షల కోసం రూ.కోట్లలో నిధులు మళ్లించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. కేవలం రెండు నమూనాలనే పరిశీలించగా ఏకంగా రూ.1.02 కోట్లు కొట్టేసినట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై లోతైన దర్యాప్తు అవసరమని అనిశా అధికారులు భావిస్తున్నారు. దీంతో ఈ కుంభకోణంలో కీలక నిందితులైన డా.దేవికారాణి, డా.పద్మ, డా.కూరపాటి వసంత ఇందిరా, ఓమ్ని మెడి ఎండీ కంచర్ల శ్రీహరిబాబు, ప్రతినిధి నాగరాజును రెండో విడత కస్టడీకి తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు వారం రోజుల కస్టడీకి అప్పగించాలని న్యాయస్థాయాన్ని అభ్యర్థించారు. నిందితులను శనివారం నుంచి 3 రోజుల కస్టడీకి అనుమతిస్తూ గురువారం కోర్టు ఆదేశాలిచ్చింది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు