close

జాతీయ- అంతర్జాతీయ

ఉగ్రవాదంపై ఉమ్మడిగా పోరాడదాం

 కేంద్ర హోంశాఖ సహాయమంత్రి  కిషన్‌ రెడ్డి పిలుపు

ఈనాడు, దిల్లీ: శాంతి-భద్రతలు, అభివృద్ధికి పొంచి ఉన్న అతిపెద్ద ముప్పుగా ఉగ్రవాదాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌ రెడ్డి అభివర్ణించారు. ఉగ్రవాదంపై, దానికి అండగా నిలుస్తున్నవారిపై ఉమ్మడిగా పోరాడదామంటూ ప్రపంచ దేశాలకు ఆయన పిలుపునిచ్చారు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో గురువారం ‘ఉగ్రవాద నిధుల కట్టడి’ సదస్సులో కిషన్‌ రెడ్డి ప్రసంగించారు. ఉగ్రవాదాన్ని ఎంతమాత్రం సహించకూడదన్నారు. కొన్ని దేశాలు ముష్కరులకు మద్దతుగా నిలుస్తున్నాయంటూ పరోక్షంగా పాకిస్థాన్‌ను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. ఉగ్రవాదంపై పోరులో రాజకీయాలకు తావివ్వకూడదని స్పష్టం చేశారు. అంతర్జాతీయ ఉగ్రవాదంపై ఐరాస నేతృత్వంలో సమగ్ర సమావేశం నిర్వహించడంలో అన్ని దేశాలు చొరవ చూపాలని కోరారు. వచ్చే ఏడాది ‘ఉగ్రవాద నిధుల కట్టడి’ సదస్సును భారత్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు