close

జాతీయ- అంతర్జాతీయ

నది రాళ్లలో ఇరుక్కుపోయి పులి మృతి

బల్లార్ష, న్యూస్‌టుడే: మహారాష్ట్ర చంద్రపుర్‌ జిల్లాలోని భద్రావతి తాలూకా జూనా కనడా వద్ద శిరానా నది ఒడ్డున రాళ్లలో ఇరుక్కుపోయి ఓ పులి మృతి చెందింది. భద్రావతి తాలూకాలోని బొగ్గు గని క్షేత్రం పరిసరాలలో పులి వారం రోజులుగా సంచరిస్తూ ఉంది. బుధవారం శిరానా నది వంతెనపై నుంచి వెళుతుండగా ప్రమాదవశాత్తు జారిపడి రాళ్లలో ఇరుక్కుపోయింది. విషయం తెలుసుకున్న అటవీ అధికారులు క్రేన్‌ సహాయంతో బయటకు తీయడానికి ప్రయత్నం చేశారు. చీకటి పడటం, నదిలో ప్రవాహం అధికంగా ఉండటంతో వెనుదిరిగారు. గురువారం వెలికి తీయగా అప్పటికే బలమైన గాయాలు కావడంతో మృతి చెందింది.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు