close

జాతీయ- అంతర్జాతీయ

దంతాలు శుభ్రం..రికార్డు సొంతం

అంతర్జాతీయ టూత్‌ బ్రషింగ్‌ డే(దంతాలు శుభ్రం చేసుకునే దినోత్సవం) సందర్భంగా ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లోని కళింగ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్స్‌స్‌ ఆదివాసీ విద్యాసంస్థ(కిస్‌)లో గురువారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కిస్‌ యాజమాన్యం, ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ డెంటిస్ట్స్‌, కాల్గేట్‌ సంస్థల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో.. 26,882 మంది విద్యార్థులు ఒకే సమయంలో బ్రష్‌ చేసి గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సాధించారు. గిన్నిస్‌బుక్‌ సంస్థ అధికారులు ధ్రువపత్రం అందజేశారు. 2016లో దిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో జరిగిన కార్యక్రమంలో 16,441 మంది విద్యార్థులు ఏకసమయంలో దంతాలు తోమి గిన్నిస్‌బుక్‌లో స్థానం సంపాదించుకున్నారు.

- న్యూస్‌టుడే భువనేశ్వర్‌ అర్బన్‌

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు