close

ఆంధ్రప్రదేశ్

మందగమనంలోనూ నిలదొక్కుకున్నాం

 ప్రభుత్వ ఆదాయ వనరులపై సమీక్షలో సీఎం జగన్‌
గత ఏడాదితో పోలిస్తే 2.1 శాతం తగ్గిన ఆదాయం

ఈనాడు, అమరావతి: ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్నప్పటికీ ఆదాయ పరంగా నిలదొక్కుకున్నామని, ఇది సానుకూల అంశమని, దేవుడు మనతో ఉన్నాడని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదాయ వనరులపై క్యాంప్‌ కార్యాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. శాఖల వారీగా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం, ప్రస్తుత పరిస్థితులపై చర్చ జరిగింది. మద్యం దుకాణాలను ప్రభుత్వం నిర్వహిస్తుండటం వల్ల లైసెన్స్‌ ఫీజు కోల్పోయామని అధికారులు ప్రస్తావించారు. దీనిపై స్పందించిన సీఎం.. మద్యాన్ని నియంత్రించాల్సిందేనని స్పష్టం చేశారు. అన్ని శాఖలకు కలిపి గత ఏడాది అక్టోబరు వరకు రూ.35,411.23 కోట్ల మేర ఆదాయం రాగా, ఈ ఏడాది రూ.34,669.96 కోట్ల మేర వచ్చిందని అధికారులు వివరించారు. మొత్తం మీద 2.10 శాతం ఆదాయం తగ్గిందని పేర్కొన్నారు. రవాణాశాఖ ఆదాయం మొదటి, రెండో త్రైమాసికాల్లో వరుసగా 11.81 శాతం, 12.42 చొప్పున తగ్గినప్పటికీ, అక్టోబరులో మాత్రం 15.4 శాతం వృద్ధి నమోదైందని అధికారులు తెలిపారు. సమావేశంలో శాఖల వారీగా గత ఏడాది, ఈ ఏడాది అక్టోబరు వరకు వచ్చిన ఆదాయాల వివరాలను అధికారులు ప్రజంటేషన్‌ ద్వారా సీఎంకు వివరించారు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు