close

క్రీడలు

చెస్‌ ఒలింపియాడ్‌ 2021కి వాయిదా

చెన్నై: ఆగస్టు 5 నుంచి 17 వరకు మాస్కోలో జరగాల్సిన చెస్‌ ఒలింపియాడ్‌ను ఫిడే.. 2021కి వాయిదా వేసింది. కరోనా మహమ్మారి కారణంగా ఫిడే ఈ నిర్ణయం తీసుకుంది. ‘‘చెస్‌ ఒలింపియాడ్‌ ఎంతో పేరున్న ఫిడే ఈవెంట్‌ అని అందరికీ తెలుసు. క్రీడాకారులు, కోచ్‌, అధికారులు, ప్రేక్షకులు వేలల్లో ఈ టోర్నీకి హాజరవుతారు. ఈ టోర్నీ ఉద్దేశం కేవలం ఫలితం ఒక్కటే కాదు.. ఆటను వ్యాప్తి చేయడం, చెస్‌ అభిమానులను ఒక్కటి చేయడం కూడా. అదే సమయంలో కరోనా మహమ్మారి తీవ్రత రోజు రోజుకూ పెరుగుతుండడం ఫిడే అందోళన చెందుతోంది. డబ్ల్యూహెచ్‌ఓ నివేదికలు, టోక్యో ఒలింపిక్స్‌కు సంబంధించి ఐఓసీ ప్రకటనను పరిగణనలోకి తీసుకని 44వ చెస్‌ ఒలింపియాడ్‌ను వాయిదా వేయాలని నిర్ణయించాం’’ అని ఫిడే ఓ ప్రకటనలో తెలిపింది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు