close

క్రీడలు

ఎక్కడి ర్యాంకులు అక్కడే..

నిలిపివేసే యోచనలో బీడబ్ల్యూఎఫ్‌

దిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌ వాయిదాపడ్డ నేపథ్యంలో బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్స్‌ను స్తంభింపచేసే అవకాశాల్ని పరిశీలిస్తున్నామని ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) చెప్పింది. ‘‘ఒలింపిక్స్‌ వాయిదాతో ఒలింపిక్స్‌, పారాలింపిక్స్‌ క్వాలిఫికేషన్‌ వ్యవస్థపై ఏమైనా ప్రభావం పడిందేమో చూస్తాం. తిరిగి అంతర్జాతీయ టోర్నీలు ఆరంభమయ్యే వరకు ర్యాంకులను స్తంభింపచేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నాం’’ అని బీడబ్ల్యూఎఫ్‌ ఓ ప్రకటలో చెప్పింది. భారత షట్లర్లు సైనా నెహ్వాల్‌, సాయిప్రణీత్‌, పారుపల్లి కశ్యప్‌, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌.. ర్యాంకులను స్తంభింపచేయాలని ఇప్పటికే కోరారు. ‘‘కరోనా వైరస్‌ కారణంగా బీడబ్ల్యూఎఫ్‌ టోర్నమెంట్లు వాయిదా వేసినా మా పాయింట్లు తగ్గిపోతున్నాయి. స్విస్‌ ఓపెన్‌ను వాయిదా వేశారు. అయినా నా పాయింట్లు తగ్గాయి. ఇలా వాయిదా వేసిన అన్ని టోర్నీలకూ పాయింట్లు తగ్గిస్తూ పోతే ఏం జరుగుతుందో తెలియదు’’ అని సాయిప్రణీత్‌ అన్నాడు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు