close

బిజినెస్‌

లాక్‌డౌన్‌పై ఎవరు ఏమ్మన్నారంటే...

నిరుపేదలకు నిత్యావసరాలు అందిద్దాం

‘లాక్‌డౌన్‌ ఆంక్షలు ప్రస్తుతం ఎంతో అవసరం. అయితే పేదవాళ్లు, రోజువారీ వేతన కూలీలు, కాంట్రాక్టు పని చేసే వాళ్ల పరిస్థితిని తలచుకుంటేనే బాధేస్తోంది. ఇలాంటి సమయంలో వాళ్లకు ఎలాంటి కష్టం కలగకూడదంటే మనం ఓ పని చేస్తే బావుంటుంది. కనీసం మూడు నిరుపేద కుటుంబాలకు రేషన్‌, నిత్యావసరాలను అందిద్దాం’

- ఆనంద్‌ మహీంద్రా, ఛైర్మన్‌, ఎం & ఎం


పోలీసుల నుంచి అనుమతి పత్రాలు తీసుకోండి

‘లాక్‌డౌన్‌ను ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో పాటించాలి. ప్రభుత్వానికి మన సహకారం ఎంతో అవసరం. పోలీసులు కఠినంగా వ్యవహరించకుండా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నించాలి. అత్యవసర సేవల్లో పనిచేస్తున్న వాళ్లకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండాలంటే పోలీసుల నుంచి అనుమతి పత్రాలను కంపెనీలు తీసుకోవాలి’

- కిరణ్‌ మజుందార్‌షా, ఛైర్‌పర్సన్‌, బయోకాన్‌


బ్రిటన్‌ పద్ధతి పాటిద్దాం

‘లాక్‌డౌన్‌ సమయంలో బ్రిటన్‌లో కొంత మంది ప్రజలు ఇంటి ముందు ఆకుపచ్చ కాగితం తలిగిస్తున్నారు. నిత్యావసర సరుకులు అయిపోయినా.. ఆరోగ్య సమస్య తలెత్తినా దానిని తీసేసి, ఎరుపు రంగు కాగితం పెడుతున్నారు. అది చూసి పోలీసులు, సహాయక సిబ్బంది స్పందించి వాళ్లకు అవసరమైన సహాయాన్ని అందిస్తున్నారు. మనమూ ఇలాంటి పద్ధతిని అనుసరించొచ్చు’

-  హర్ష గోయెంకా, ఛైర్మన్‌, ఆర్‌పీజీ ఎంటర్‌ప్రైజెస్‌



 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు