close

బిజినెస్‌

ఉద్దీపన ప్యాకేజీపై ఆశలతో..

1862 పాయింట్లు దూసుకెళ్లిన సెన్సెక్స్‌
మార్కెట్‌ సమీక్ష

త్సాహం ఉరకలేసింది. వరుస నష్టాలతో కొట్టుమిట్టాడిన మదుపరికి ఉపశమనం కొనసాగింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ప్రభుత్వం ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించొచ్చన్న ఆశలతో మార్కెట్లు దూసుకెళ్లాయి. అమెరికా సెనేట్‌, ప్రభుత్వం 2 లక్షల కోట్ల డాలర్ల ఉద్దీపన ప్యాకేజీకి ఒప్పందం కుదుర్చుకోవడం అంతర్జాతీయ సెంటిమెంట్‌పై సానుకూల ప్రభావం చూపింది. గుడిపడ్వా సందర్భంగా దేశీయ కరెన్సీ మార్కెట్లు పనిచేయలేదు.

సెన్సెక్స్‌ ఉదయం 26,499.81 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. అనంతరం ఒడుదొడుకులు ఎదుర్కొన్న సూచీ.. ఇంట్రాడేలో 26,359.91 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత బలంగా పుంజుకున్న సూచీ లాభాల్లోకి వచ్చింది. ఒకానొకదశలో 28,790.19 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకి.. చివరకు 1861.75 పాయింట్లు పెరిగి 28,535.78 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ సైతం 516.80 పాయింట్ల లాభంతో 8,317.85 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 7,714.75- 8,376.75 పాయింట్ల మధ్య కదలాడింది.

* రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు చెలరేగింది. కంపెనీ టెలికాం విభాగం జియోలో వాటా కొనుగోలుకు ఫేస్‌బుక్‌ చర్చలు జరుపుతున్నట్లు వార్తలు రావడమే ఇందుకు నేపథ్యం. ఇంట్రాడేలో 22.25 శాతం పెరిగిన షేరు రూ.1152 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 14.65 శాతం లాభంతో రూ.1081.25 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.87,576.98 కోట్లు పెరిగి రూ.6.85 లక్షల కోట్లకు చేరింది. తాజా లాభాలతో మరోసారి స్టాక్‌ మార్కెట్‌లో విలువైన కంపెనీగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నిలిచింది. రూ.6.57 లక్షల కోట్ల మార్కెట్‌ విలువతో టీసీఎస్‌ రెండో స్థానంలో ఉంది.

సెన్సెక్స్‌ 30 షేర్లలో 27 లాభాలతో ముగిశాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 14.65%, కోటక్‌ బ్యాంక్‌ 12.31%, మారుతీ సుజుకీ 12.23%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 11.77%, హెచ్‌డీఎఫ్‌సీ 9.44%, టైటన్‌ 8.24%, ఎల్‌ అండ్‌ టీ 8.22%, యాక్సిస్‌ బ్యాంక్‌ 7.83%, అల్ట్రాటెక్‌ 7.13%, ఐసీఐసీఐ బ్యాంక్‌ 6.93%, నెస్లే 6.46% చొప్పున రాణించిన వాటిలో ఉన్నాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఓఎన్‌జీసీ, ఐటీసీ 3.57% వరకు నష్టపోయాయి. రంగాల వారీ సూచీల్లో అన్ని లాభాల్లో ముగిశాయి. ఇంధన, ఫైనాన్స్‌, బ్యాంకింగ్‌, వాహన, చమురు- గ్యాస్‌ 10 శాతం మేర రాణించాయి. బీఎస్‌ఈలో 1186 షేర్లు లాభాల్లోనూ, 1023 షేర్లు నష్టాలతోనూ ముగిశాయి. 147 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.

ప్రపంచ మార్కెట్ల జోరు
కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు భారీ ఉద్దీపన ప్యాకేజీకి అమెరికా చట్టసభలు ఆమోదం తెలపడంతో ప్రపంచ మార్కెట్ల జోరు కొనసాగించింది. వరుసగా రెండో రోజూ ఆసియా మార్కెట్లు దూసుకెళ్లాయి. ఆసియా మార్కెట్లలో నిక్కీ 1454 పాయింట్లు, షాంఘై కాంపోజిట్‌ 59 పాయింట్లు, హాంగ్‌సెంగ్‌ 864 పాయింట్లు, కోస్పి 95 పాయింట్లు మేర రాణించాయి. ఐరోపా మార్కెట్లు లాభాల్లో ట్రేడయ్యాయి. జర్మనీ డాక్స్‌ 174 పాయింట్లు, బ్రిటన్‌ ఎఫ్‌టీఎస్‌ఈ 242 పాయింట్లు, ఫ్రాన్స్‌ క్యాక్‌ 190 పాయింట్లు చొప్పున లాభాలు నమోదు చేశాయి. అమెరికా సూచీలు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటల సమయానికి డోజోన్స్‌ 1050 పాయింట్లు, నాస్‌డాక్‌ 170 పాయింట్ల లాభాలతో ట్రేడవుతున్నాయి.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు