close

సినిమా

వినాయక్‌ విరాళం రూ.5 లక్షలు

పేద సినీ కళాకారులు, సాంకేతిక నిపుణుల అవసరాల కోసం ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్‌ రూ.5 లక్షలు విరాళంగా అందజేశారు. కరోనా వైరస్‌ కారణంగా సినిమా చిత్రీకరణలు నిలిచిపోయాయి. దాంతో దినసరి వేతనంతో పనిచేసే పేద  కళాకారులు, సాంకేతిక సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. అలాంటివాళ్లకి సహాయం అందించేందుకు  దర్శకుడు వి.వి.వినాయక్‌ ముందుకొచ్చారు. నటుడు కాదంబరి కిరణ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న మనం సైతం ఫౌండేషన్‌కి రూ.5 లక్షల చెక్‌ని అందజేశారు.  వినాయక్‌ మాట్లాడుతూ ‘‘అందరినీ వణికిస్తున్న కరోనా వైరస్‌ని మనం మన ఇళ్లల్లోనే ఉంటూ వణికించాలి. చిత్ర పరిశ్రమలోని కళాకారులు, సాంకేతిక సిబ్బంది, డ్యాన్సర్లు, ఫైటర్లు... ఇలా చాలామంది నెల రోజులపాటు చిత్రీకరణలు లేకపోతే ఇబ్బందులు ఎదుర్కుంటారు. వాళ్లకి నిత్యా  వసర వస్తువులు అందజేసే నిమిత్తం నా వంతు సాయం అందించా. నిజంగా ఎవరికి అవసరమో వాళ్లు కాదంబరి కిరణ్‌ని సంప్రదించి నిత్యావసరాల్ని తీసుకోవాల’’ని కోరారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు