close

సినిమా

మేమున్నాం...

రోనా కారణంగా సినిమా చిత్రీకరణలు, విడుదలలు ఆగిపోవడంతో చాలామంది సినీ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. వారి సహాయార్ధం పలువురు సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు. పెద్ద మనసుని చాటుకుంటూ విరాళాలను అందజేస్తున్నారు.
ధనుష్‌ రూ.15లక్షలు... కమల్‌ రూ.10 లక్షలు ప్రముఖ తమిళ నటుడు ధనుష్‌ దక్షిణ భారత సినీ కార్మికుల సంక్షేమ సంఘాల సమాఖ్య (ఫెఫ్సీ)కి రూ.15 లక్షలు అందజేశారు. ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌, దర్శకుడు శంకర్‌లు చెరో రూ.10 లక్షలు ఇచ్చారు. ఈవీపీ సంస్థ రూ.2 లక్షలను అందజేసింది. దర్శకుడు కార్తిక్‌ సుబ్బరాజ్‌ రూ.లక్ష, దర్శకనటుడు చిత్రా లక్ష్మణ్‌ రూ.25వేలు ఇచ్చారు. నిర్మాత ప్రభు 150 బియ్యం బస్తాలు, నటుడు రాజేష్‌ 1000 బస్తాలు (10 కిలోలు) నటి రోజా 100 బియ్యం బస్తాలను ఫెఫ్సీకి అందజేశారు.

- న్యూస్‌టుడే, కోడంబాక్కం


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు