close

సినిమా

సితారతో సరదాగా

మాత్రం ఖాళీ దొరికినా కుటుంబంతో గడుపుతుంటారు మహేష్‌బాబు. కుటుంబమే తన ప్రపంచం అంటుంటారాయన. అనుకోకుండా దొరికిన ఈ ఖాళీ సమయంలో కూడా పిల్లలతో గడుపుతున్నారాయన. ప్రస్తుతం మహేష్‌ కూతురు సితార ఆనందానికైతే అవధుల్లేవట. సితార నాన్న కూచీ అని, 21 రోజులు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో తనకి ఎంతో ఇష్టమైన నాన్నతో గడపొచ్చని సంబరపడుతోందని మహేష్‌ భార్య నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలిపారు. ఇంట్లో తండ్రీకూతుళ్లు కలిసి సరదాగా చేస్తున్న అల్లరికి సంబంధించిన చిత్రాల్ని ఆమె పంచుకున్నారు. సితార ఇక ఈ కొన్నాళ్లు మహేష్‌ని వదిలిపెట్టి ఉండదని, అందరూ ఇళ్లల్లోనే సంతోషంగా గడపండంటూ నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలిపారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు