close

ఆంధ్రప్రదేశ్

వుహాన్‌ కోలుకుంటోంది

లాక్‌డౌన్‌ ఎత్తివేత...
రైళ్లు, బస్సులు కిటకిట

బీజింగ్‌: కరోనా వైరస్‌ కేంద్రం... చైనాలోని హుబెయ్‌ ప్రావిన్స్‌ రాజధాని వుహాన్‌ క్రమంగా కోలుకుంటోంది. మహమ్మారి విజృంభణతో సుమారు రెండు నెలల క్రితం లాక్‌డౌన్‌ అయిన ఈ నగరంలో ప్రభుత్వం ఆంక్షలు సడలించింది. నిర్బంధాలను ఎత్తివేసింది. దీంతో వారాల తరబడి అక్కడ చిక్కుకుపోయిన ఇతర ప్రాంతాల వారు బుధవారం తమ ఇళ్లకు వెళ్లేందుకు రోడ్లపైకి వచ్చారు. విమానాలు, రైళ్లు, బస్సులు మళ్లీ జనంతో సందడిగా కనిపించాయి. ప్రతి ఒక్కరిలోనూ ఎంతో ఉద్వేగం కనిపించింది.
అయితే పాఠశాలలు మాత్రం తెరచుకోలేదు.

వ్యాక్సిన్‌ ప్రయోగాలకు 5,000 మంది ముందుకు...
మహమ్మారి నియంత్రణకు ‘చైనా అకాడమీ ఆఫ్‌ మిలిటరీ మెడికల్‌ సైన్సెస్‌’ రూపొందించిన వ్యాక్సిన్‌ తొలిదశ ప్రయోగానికి సిద్ధమైంది. ఈ క్రతువులో భాగస్వామ్యమవుతామని, వ్యాక్సిన్‌ వేయించుకుంటామంటూ వుహాన్‌కు చెందిన 5,000 మంది ముందుకొచ్చారు. వీరంతా 18-60 ఏళ్ల మధ్య వయస్కులేనని ప్రభుత్వ పత్రిక ‘బీజింగ్‌ న్యూస్‌’ తెలిపింది. ఏప్రిల్‌ చివరి నాటికి వ్యాక్సిన్‌ ప్రయోగాత్మక పరీక్షలు పూర్తయ్యే అవకాశముందని కొందరు నిపుణులు చెబుతున్నారు.

చైనాలో మంగళవారం దేశీయంగా ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అయితే వివిధ దేశాల నుంచి వచ్చిన వారిలో 47 మందికి ఈ వైరస్‌ సోకినట్టు విదేశాంగశాఖ తెలిపింది. తాజా కేసులతో కలిపి దిగుమతి అయిన (ఇంపోర్టెడ్‌) కేసుల సంఖ్య 474కు చేరిందనీ, ఈ బాధితుల్లో 47 మంది విదేశీయులు కాగా, మిగతా వారంతా తమ దేశానికి చెందినవారేనని పేర్కొంది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు