close

క్రైమ్

చనిపోయిన మావోయిస్టుల వివరాలు వెల్లడి

చర్ల, న్యూస్‌టుడే: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు, పోలీసు బలగాలకు మధ్య ఈనెల 22న జరిగిన భీకర పోరులో చనిపోయిన ముగ్గురు మావోయిస్టుల వివరాలను ఆ పార్టీ దక్షిణ బస్తర్‌ సబ్‌ జోనల్‌ బ్యూరో నేత వికల్ప్‌ ఛత్తీస్‌గఢ్‌ మీడియాకు వెల్లడించారు. సుక్మా జిల్లా మినప అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో పీఎల్‌జీఏ సభ్యులు కొవ్వాసి సక్రు, కొట్టం రాజేశ్‌, కరటం సుక్కులు చనిపోయినట్లు ప్రకటించారు. ఇదే ఘటనలో 17 మంది జవాన్లు మరణించిన విషయం విదితమే. జవాన్ల నుంచి మావోయిస్టులు స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, ఇతర సామగ్రి వివరాలను అక్కడి మీడియాకు వెల్లడించారు. ఎదురు కాల్పుల్లో చనిపోయిన మావోయిస్టుల అంతిమ సంస్కారాలు బుధవారం దండకారణ్యంలో నిర్వహించినట్లు తెలిపారు. పెద్ద సంఖ్యలో మావోయిస్టుల ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు