close

జాతీయ- అంతర్జాతీయ

విదేశీయుల వీసాల గడువును పెంచిన బ్రిటన్‌

లండన్‌: కొవిడ్‌-19 వైరస్‌ కారణంగా తమ దేశంలో చిక్కుకుపోయిన విదేశీయుల వీసాల గడువును బ్రిటన్‌ రెండు నెలల పాటు పొడిగించింది. మహమ్మారి విజృంభణ నేపథ్యంలో బ్రిటన్‌ తమ దేశం నుంచి ఇతర దేశాలకు రాకపోకలు నిషేధించింది. ఈ పరిణామంతో లండన్‌లో ఉంటున్న భారతీయులు అక్కడి ఇండియన్‌ హైకమిషన్‌ను సామాజిక మాధ్యమాల ద్వారా సంప్రదించారు. ‘‘జనవరి 24 నుంచి స్వీయ నిర్బంధంలో ఉన్న, ప్రయాణ సాధనాలు లేక బ్రిటన్‌లోనే ఉండిపోయిన విదేశీయుల వీసాల గడువును మే, 31 వరకూ పొడిగిస్తున్నాం. వీసాల గడువు ముగిసిందన్న ఆందోళన అవసరం లేదు. అవసరమైతే పరిస్థితిని బట్టి ఈ గడువును మరింత పొడిగిస్తాం’’ అని భారత సంతతికి చెందిన బ్రిటన్‌ హోంమంత్రి ప్రీతి పటేల్‌ వెల్లడించారు.

అవసరమున్నవారు ఈ-మెయిల్‌ చేయాలి
యూకే వీసా అండ్‌ ఇమిగ్రేషన్‌ (యూకేవీఐ) ‘‘స్ట్రెయిట్‌ ఫార్వార్డ్‌’’ కింద వీసా గడువు పెంపు ప్రక్రియను చేపడుతోందని, అవసరమున్నవారు CIH@homeoffice.gov.uk కు ఈ-మెయిల్‌ చేయాలని సంబంధిత అధికారులు తెలిపారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు