close

జాతీయ- అంతర్జాతీయ

సరిహద్దుల్లో చిక్కుకున్న వారి కోసం మార్గాలను అన్వేషించండి

పోలీసులకు కిషన్‌రెడ్డి సూచన

ఈనాడు, దిల్లీ: అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా వారివారి స్వస్థలాలకు చేర్చే మార్గాలను అన్వేషించాలని పోలీసు యంత్రాంగానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి సూచించారు. అవసరమైతే స్థానిక అధికారులను సమన్వయం చేసుకోవాలని సూచించినట్లు తెలిసింది. బుధవారమిక్కడ నిర్మాణ్‌ భవన్‌లో కొవిడ్‌-19పై ఏర్పాటైన మంత్రుల బృందం సమావేశం అనంతరం రాజ్‌నాథ్‌ సింగ్‌ నివాసంలో పలువురు మంత్రులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ నియంత్రణకు సంబంధించి తాజా పరిస్థితిపై చర్చించినట్లు సమాచారం. నిరంతరం ఎవరో ఒక మంత్రి నార్త్‌బ్లాక్‌ కంట్రోల్‌ రూంతో సమన్వయం చేస్తూ ఉండాలని వారంతా నిర్ణయించినట్లు తెలిసింది. రాష్ట్రాల్లో నిత్యావసరాల కొరత లేకుండా తగిన చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు ఆదేశాలిచ్చినట్లు సమాచారం. అనంతరం కిషన్‌రెడ్డి నార్త్‌బ్లాక్‌కు చేరుకుని కంట్రోల్‌ రూం నుంచి అన్ని రాష్ట్రాల్లోని పరిస్థితిని సమీక్షించినట్లు తెలిసింది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు