close

బిజినెస్‌

వాహనాన్ని వాడినప్పుడే బీమా

ఈనాడు, హైదరాబాద్‌: వాహనాన్ని వాడినప్పుడే బీమా పాలసీ వర్తించే వినూత్న పాలసీని ఎడిల్‌వైజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగానే ఒకే పాలసీలో కుటుంబంలో ఉన్న అన్ని వాహనాలకు రక్షణ కల్పించే ఏర్పాటూ ఉంది. ఈ ‘ఎడిల్‌వైజ్‌ స్విచ్‌’ను తీసుకున్నప్పుడు.. వాహనం రోడ్డుపైకి వెళ్లినప్పుడే బీమా పాలసీ వర్తించేలా ‘ఆన్‌’ చేసుకోవాలి. లేకపోతే ‘ఆఫ్‌’ చేసి పెట్టొచ్చు. డ్రైవర్‌ వయసు, అనుభవం, వాహనం మోడల్‌, ఎన్ని రోజులు వాహనాన్ని వాడుతున్నారు అనేదాని ఆధారంగా ప్రీమియం వసూలు చేస్తామని సంస్థ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ షనాయ్‌ ఘోష్‌ తెలిపారు. యాప్‌ ఆధారంగా పనిచేసే ఈ పాలసీలో.. ఎప్పుడు బీమా రక్షణ కావాలి.. ఏయే వాహనాలను జోడించుకోవాలన్నది వాహనదారుడే నిర్ణయించుకోవచ్చు. పాలసీ అమల్లో ఉన్న సమయంలో ప్రమాదాలకు వర్తిస్తుంది. పాలసీని ఆఫ్‌ చేసినప్పుడూ దొంగతనం, అగ్నిప్రమాదాల వల్ల నష్టం కలిగితే పరిహారం లభిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో వాహనదారుల అవసరాలకు తగ్గట్టుగా కారు, ద్విచక్రవాహనాన్నీ కలిపి ఈ పాలసీని ఎంచుకోవచ్చు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు