close

బిజినెస్‌

ఆహార సరఫరా సేవల్లోకి అమెజాన్‌

దిల్లీ: జొమోటో, స్విగ్గీ వంటి ఆహార సరఫరా సంస్థలకు పోటీగా అమెజాన్‌ ఇండియా రంగంలోకి దిగింది. తొలుత బెంగళూరులో ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. కొద్ది నెలలుగా ఈ సేవలను అమెజాన్‌ ఇండియా ప్రయోగాత్మకంగా జరుపుతోంది. ‘అమెజాన్‌లో షాపింగ్‌ చేయడంతో పాటు, తినేందుకు సిద్ధంగా ఉంచిన ఆహారం కోసం ఆర్డర్లు ఇవ్వాలని భావిస్తున్నట్లు ఎప్పటి నుంచో మా వినియోగదార్లు చెబుతూ వస్తున్నారు. ప్రస్తుత సమయంలో వారు ఇంట్లో భద్రంగా ఉండాలంటే ఈ సేవలు ముఖ్యం. స్థానిక వ్యాపారులకూ ఇపుడు చేయూత అవసరమ’ని అమెజాన్‌ ఇండియా ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. బెంగళూరులోని మహదేవపుర, మరతల్లి, వైట్‌ఫీల్డ్‌, బెలాందూర్‌లలోని 100కు పైగా రెస్టారెంట్ల నుంచి ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.
* రాంచీలో మద్యం (ఆల్కహాల్‌) హోం డెలివరీ సేవలు మొదలుపెట్టిన స్విగ్గీ, జొమాటో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతోనూ చర్చలు జరుపుతున్నాయి.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు