close

సినిమా

ఆ ఐదు హత్యలు ఎవరు చేశారు?

ఉత్కంఠగా జ్యోతిక పొన్‌మగళ్‌ వందాళ్‌ ట్రైలర్‌

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ తర్వాత దేశవ్యాప్తంగా సినిమా షూటింగ్‌లు నిలిచిపోయాయి. థియేటర్లు మూతపడ్డాయి. దీంతో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని వేసవిలో విడుదల చేద్దామనుకున్న సినిమాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎలాగైనా సినిమా విడుదల చేయాలని భావించిన దర్శక-నిర్మాతలకు కనిపించిన వేదిక ఓటీటీ. జ్యోతిక కీలక పాత్రలో నటించిన ‘పొన్‌మగళ్‌ వందాళ్‌’ కూడా ఓటీటీలో విడుదల చేస్తామని ప్రకటించగానే కోలీవుడ్‌లో దుమారం రేగింది. అయినా, సరే దర్శక-నిర్మాతలు అటువైపే మొగ్గు చూపారు. దీంతో మే 29 అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదలవుతున్న తొలి తమిళ సినిమాగా వార్తల్లో నిలిచింది. ఈ సందర్భంగా తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.

లీగల్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు జె.జె.ఫెడ్రిక్‌ దర్శకత్వం వహించారు. జ్యోతిక ఇందులో లాయర్‌గా నటించారు. 2004లో ‘సైకో జ్యోతి’ చేసిన వరుస హత్యలకు సంబంధించిన కేసును రీఓపెన్‌ చేస్తారు. నిజాయతీపరురాలైన లాయర్‌ వెన్బా ఈ కేసును ఎందుకు వాదించాల్సి వచ్చింది? న్యాయశాస్త్రంలో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకుని ఈ కేసును ఎలా నీరుగార్చారు. చివరకు వరుస హత్యల వెనుక నిజానిజాలు బయటపడ్డాయా? అన్నదే కథ.

జ్యోతిక తొలిసారి లాయర్‌ పాత్రలో నటిస్తున్నారు. ఆమెతో పాటు భాగ్యరాజా, పార్తిబన్‌, పాండియరాజన్‌, ప్రతాప్‌ పోతన్‌లు కీలక పాత్రల్లో నటించారు. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నటుడు, జ్యోతిక భర్త సూర్య ఈ సినిమాను నిర్మించారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు