close

సినిమా

మోనాలిసాగా మారితే!

రష్మిక...దక్షిణాది చిత్ర సీమలో ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమలో జోరుగా వినిపిస్తున్న పేరు. ‘సరిలేరు నీకెవ్వరూ’, ‘భీష్మ’ చిత్ర విజయాలతో జోరుమీదున్న ఈ నాయిక ప్రస్తుతం అల్లు అర్జున్‌తో కలిసి ‘పుష్ప’లో నటిస్తోంది. అయితే తన పేరుని మార్చుకుంటే ఎలా ఉంటుంది? అనే ఓ సరదా ఆలోచన రష్మిక మదిలో మెదిలింది. ఇదే ప్రశ్న ట్విటర్‌లో అభిమానుల్ని అడిగింది. వాళ్లూ అంతే ఫన్నీగా సమాధానాలు చెప్పారు. లిల్లీ, పూజ, తలస్మిక, పింకీ, ఎనర్జీ, హనీ, శాన్వి..ఇలా అభిమానులు రకరకాలుగా పేర్లు సూచించారు. ఓ అభిమాని ‘మోనాలిసాలా ప్రపంచంలో మీకంటే అందగత్తె ఎవరు? పైగా మీ ముద్దు పేరు మోనీ కాబట్టి మోనాలిసా అని   పెట్టేసుకోండి’అని ట్వీట్‌ చేశాడు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు