close

క్రీడలు

ఉత్సాహపరిచేందుకు ఆ బొమ్మలు

హాంకాంగ్‌: కరోనా మహమ్మారి ధాటికి ఆటలన్నీ ఆగిపోయాయి. కొన్ని దేశాల్లో పరిస్థితులు మెరుగుపడి తిరిగి ఆటలు ఆరంభమవుతున్నప్పటికీ.. అభిమానులను స్టేడియాలకు అనుమతించే అవకాశాల్లేవు. ఖాళీ స్టేడియాల్లోనే మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. ప్రేక్షకులతో స్టాండ్స్‌ నిండుగా ఉండి.. కేరింతలతో వాళ్లు ఉత్సాహపరుస్తుంటే ఆటగాళ్లకు వచ్చే కిక్కే వేరు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి వాతావరణం స్టేడియాల్లో కనిపించడం కష్టమే. అయితే ఆ లోటు తెలీకుండా ఉండేందుకు.. అభిమానులు లేకున్నా.. ఉన్నట్లుగా అనుభూతి కలిగించేందుకు నిర్వాహకులు కొత్త మార్గాలు వెతుకుతున్నారు. సీట్లలో ప్రేక్షకుల ఫొటోలను పెడుతున్నారు. డ్రమ్ములు వాయించే రోబోలను ఏర్పాటు చేస్తున్నారు. కానీ అలాంటి దారిలోనే వెళ్లిన దక్షిణ కొరియాకు చెందిన ఎఫ్‌సీ సియోల్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ సుమారు రూ.61 లక్షల జరిమానా ఎదుర్కొంది. సెక్స్‌ టాయ్స్‌ను స్టేడియంలో ఏర్పాటు చేయడమే దానికి కారణం.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు