close

క్రీడలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
జ్యోతికి సాయ్‌ అవకాశం

దిల్లీ: అనారోగ్యంతో ఉన్న నాన్నను వెనకాల కూర్చోబెట్టుకుని 7 రోజుల పాటు 1200 కిలోమీటర్లు సైకిల్‌ తొక్కిన జ్యోతి కుమారి కష్టానికి గుర్తింపు లభించింది. ఆమెలోని సైక్లింగ్‌ నైపుణ్యాన్ని గుర్తించిన భారత సైక్లింగ్‌ సమాఖ్య (సీఎస్‌ఎఫ్‌) జ్యోతిని ట్రయల్స్‌కు పిలిచింది. ఎనిమిదో తరగతి విద్యార్థిని అయిన జ్యోతి వచ్చే నెల దిల్లీలో నిర్వహించే ఆ ట్రయల్స్‌లో అర్హత సాధిస్తే జాతీయ సైక్లింగ్‌ అకాడమీలోనే ఉచితంగా శిక్షణ అందిస్తామని సమాఖ్య తెలిపింది. జ్యోతి కుమారిది బిహార్‌. బతుకుదెరువు కోసం వాళ్ల కుటుంబం హరియాణాలోని గురుగ్రామ్‌కు వలస వచ్చింది. నాన్న మోహన్‌ ఆటో నడిపితేనే వాళ్ల కుటుంబం గడిచేది. గాయం కావడంతో అతను ఆటోను తిరిగి ఇచ్చేయడం.. మరోవైపు లాక్‌డౌన్‌ కారణంగా ఏ ఆదాయం లేకపోవడంతో వారి జీవితం దుర్భరమైంది. దీంతో వాతావరణం అనుకూలంగా లేకపోయినా.. ఇబ్బందులు ఎదురైనా నాన్నని వెనకాల కూర్చోబెట్టుకుని ఏకబిగిన ఏడు రోజుల పాటు సైకిల్‌ తొక్కింది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు