close

గ్రేటర్‌ హైదరాబాద్‌

అదనపు అందలం

 ఎక్సైజ్‌ శాఖ పోస్టింగుల్లో విచిత్ర వైఖరి
 ఒక్కో అధికారికి మూడేసి బాధ్యతలు
 కొందరు నెలల తరబడి ఖాళీ

ఎక్సైజ్‌ శాఖలో పోస్టింగుల వ్యవహారం రోజురోజుకీ ముదురుతోంది. కొందరు అధికారులకు మూడేసి చొప్పున అదనపు పోస్టింగులు కేటాయించగా.. మరికొందరికి నెలల తరబడి పోస్టింగులు ఇవ్వకుండా ఖాళీగా ఉంచడం వివాదాన్ని రాజేస్తోంది. తాజాగా ఈవ్యవహారంపై ఎక్సైజ్‌ అధికారుల సంఘం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఉమ్మడి రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో పనిచేసిన సహాయ కమిషనర్లు ప్రణవి, అనిల్‌కుమార్‌, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్లు శంభుప్రసాద్‌, నాగేందర్‌లను తెలంగాణకు కేటాయించారు. వీరంతా గతేడాది చివర్లోనే ఇక్కడ రిపోర్టు చేశారు. అప్పటివరకు సెలవులో ఉన్న మరో ఇద్దరు సూపరింటెండెంట్లూ తిరిగి విధుల్లో చేరారు. అయితే వీరికి 8 నెలలుగా వేతనాలివ్వకుండా ఖాళీగా కూర్చోబెట్టారు. ప్రస్తుతం తెలంగాణ ఎక్సైజ్‌ శాఖలో 16 మంది సహాయ కమిషనర్లకు 12 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. 12 మంది ఉప కమిషనర్లకు 9 పోస్టులు ఖాళీనే. ఇప్పటికే విధుల్లో ఉన్న అధికారులకే ఈ పోస్టుల్ని అదనంగా కేటాయించడం గమనార్హం.

- ఈనాడు, హైదరాబాద్‌

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు