close

తెలంగాణ

పోతిరెడ్డిపాడు పోరాటం ఆపొద్దు: జేసీ

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: పోతిరెడ్డిపాడుపై పోరాటం ఆపొద్దని, ఇందులో ముఖ్యమంత్రి జగన్‌ కృషి బాగుందని, సాగునీటి అంశంలో ఎవరు మేలు చేసినా అభినందించాల్సిందే అని మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి పేర్కొన్నారు. అనంతపురంలో గురువారం ఆయన మాట్లాడుతూ, అన్నదమ్ములు విడిపోయినా నీటి విషయంలో గొడవలు వస్తే.. ప్రాణాలకు తెగించి పోరాడతారన్నారు. విద్యుత్తు ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా తెదేపా నాయకుల దీక్షలు వృథా అన్నారు. ఇలాంటి ఆందోళనలు ముఖ్యమంత్రి ఇంటి దగ్గర చేయాలి కానీ.. తమ ఇళ్లలో చేస్తే ఫలితం లేదన్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు