close

ఆంధ్రప్రదేశ్

ప్రజల్ని భయపెట్టలేదు: విజయసాయిరెడ్డి

ఈనాడు, అమరావతి: ‘అంపన్‌ తుపాన్‌ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సూచనలతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించింది. శాటిలైట్‌ చిత్రాలను చూస్తూ తుపాను కదలికలన్నింటినీ ట్రాక్‌ చేసి, ప్రజల్ని భయపెట్టకుండా పనులు చేసింది’ అని వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. గురువారం ఈ మేరకు ఆయన ట్వీట్లు చేశారు. ‘కలెక్టర్లు, ఎస్పీలే తన బలమంటూ ముఖ్యమంత్రి జగన్‌ అధికార యంత్రాంగాన్ని ఆదరించిన తీరును గమనిస్తున్నారా బాబూ (చంద్రబాబు)? అప్పట్లో తమరే అంతా చేస్తున్నట్లు చూపించేవారు. అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ప్రచారం చేయించుకునేవారు’ అని పేర్కొన్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు