close

జాతీయ- అంతర్జాతీయ

వెంటిలేటర్‌పై వివాదం

కొవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో ఆసుపత్రుల్లో వెంటిలేటర్లకు ఏర్పడ్డ తీవ్ర కొరతను అధిగమించేందుకు గుజరాత్‌కు చెందిన ‘జ్యోతి సీఎన్‌సీ’ తయారుచేసిన స్వదేశీ వెంటిలేటర్‌ ధమన్‌-1పై వివాదం చెలరేగింది. ఈ ఉపకరణాన్ని స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్‌ రూపాణీ ఆవిష్కరించారు. అహ్మదాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి వెయ్యి ధమన్‌-1 వెంటిలేటర్లను జ్యోతి సంస్థ సరఫరా చేసింది. అయితే ఈ ఆసుపత్రిలో 300 మందికిపైగా కరోనా రోగులు చనిపోవడంతో సదరు వెంటిలేటర్ల నాణ్యత, సమర్థతపై కాంగ్రెస్‌ ప్రశ్నలు లేవనెత్తింది. ధమన్‌-1 వెంటిలేటర్లను సరిగా పరీక్షించలేదని, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల జీవితాలతో ఆడుకుంటోందని గుజరాత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అమిత్‌ చావ్డా విమర్శించారు. స్నేహితుడి కంపెనీ సరఫరా చేసిన సాధనం కావడంతోనే అది విఫలమైనప్పటికీ దాన్ని మార్కెట్‌ చేసేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ధమన్‌-1లోని లోపాల గురించి తయారీదారులు ప్రభుత్వానికి వివరించినా పట్టించుకోలేదని దుయ్యబట్టారు.  
అన్ని పరీక్షలు జరిగాయి
రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి జయంతి రవి ఈ అంశంపై వివరణ ఇచ్చారు. స్వయం సమృద్ధికి ధమన్‌-1 ఒక నిదర్శనమని, జ్యోతి సంస్థ చొరవను ప్రశంసించాలన్నారు. అన్ని పరీక్షలు, ధ్రువీకరణ పత్రాలను పొందాకే వెంటిలేటర్లను రాష్ట్ర ప్రభుత్వానికి ఆ సంస్థ సరఫరా చేసిందని చెప్పారు. ఈ సాధనాలకు డీజీసీఐ అనుమతి అవసరం లేదన్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం 37 వస్తువుల తయారీకే లైసెన్సు అవసరమని, ఆ జాబితాలో వెంటిలేటర్‌ లేదని చెప్పారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న కృత్రిమ ఊపిరితిత్తులపై ధమన్‌-1ను పరీక్షించారని వివరించారు. ఈ వెంటిలేటర్లను జ్యోతి సీఎన్‌సీ యజమాని పరాక్రమ్‌ సిన్హ్‌ జడేజా విరాళంగా ఇచ్చారని చెప్పారు. దీనిపై అవినీతి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని హెచ్‌ఎల్‌ఎల్‌ సంస్థ కూడా విస్తృత పరీక్షల తర్వాత 5వేల ధమన్‌-1 వెంటిలేటర్లకకు ఆర్డరిచ్చిందన్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు