close

జాతీయ- అంతర్జాతీయ

రాష్ట్రాలకు పన్నుల వాటాగా రూ.92,077 కోట్ల విడుదల

దిల్లీ: కేంద్ర పన్నుల్లో వాటా కింద రాష్ట్రాలకు రూ.92,077 కోట్లు విడుదల చేసినట్టు గురువారం ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ కార్యాలయం ట్వీట్‌ చేసింది. ఇందులో ఏప్రిల్‌ నెలకు సంబంధించిన రూ.46,038.10 కోట్లు, మే నెలకు సంబంధించిన రూ.46,038.70 కోట్లు ఉన్నాయని పేర్కొంది. వాస్తవంగా వసూలైన పన్నులను లెక్కించి కాకుండా బడ్జెట్‌లో పేర్కొన్న అంచనాల ఆధారంగా ఈ సొమ్మును విడుదల చేసినట్టు వివరించింది. రాష్ట్రాలకు పన్నుల వాటా కింద రూ.7.84 లక్షల కోట్లు ఇస్తామని బడ్జెట్‌లో పేర్కొన్నందున ఆ మేరకు నిధులు ఇస్తున్నట్టు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే అదనపు రుణాల వినియోగంపై ఆంక్షలు లేవని ఆర్థిక శాఖ వర్గాలు స్పష్టం చేశాయి.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు