close

జాతీయ- అంతర్జాతీయ

సరిహద్దు ఉద్రిక్తతలపై మాటల తూటాలు

చైనావి కవ్వింపు చర్యలన్న అమెరికా
మా దళాల గస్తీకి భారత్‌ అడ్డుతగులుతోంది: చైనా

బీజింగ్‌: భారత్‌-చైనా సరిహద్దు ఘర్షణపై గురువారం మాటల యుద్ధం చెలరేగింది. అమెరికా, చైనా, భారత్‌లు విమర్శ-ప్రతివిమర్శలు చేసుకున్నాయి. తొలుత అమెరికా స్పందిస్తూ.. సరిహద్దుల్లో చైనా దురుసు వైఖరిని ఖండించింది. కవ్వింపు చర్యలతో యథాతథస్థితిని మార్చడానికి ‘డ్రాగన్‌’ ప్రయత్నిస్తోందని దుయ్యబట్టింది. ఇటీవల భారత్‌, చైనాల సరిహద్దుల్లో ఘర్షణలు జరిగిన సంగతి తెలిసిందే. ఇరు దేశాల సైనికులు రాళ్లు, పిడి గుద్దులతో పరస్పరం దాడి చేసుకున్నారు. దీనిపై వాషింగ్టన్‌లో అమెరికా విదేశాంగ శాఖలోని దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల విభాగంలో సీనియర్‌ దౌత్యవేత్త ఆలిస్‌ జి వెల్స్‌ స్పందించారు. ‘‘చైనా తన కార్యకలాపాలకు సంబంధించి ఒక విధానాన్ని అనుసరిస్తోంది. అది నిరంతర దురుసు వైఖరి. ఎప్పటికప్పుడు నిబంధనలను, యథాతథ స్థితిని మార్చడానికి ప్రయత్నిస్తుంటుంది. దీన్ని అడ్డుకోవాలి’’ అని పేర్కొన్నారు. అమెరికా వ్యాఖ్యలు అర్థరహితమని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజాన్‌ బీజింగ్‌లో మండిపడ్డారు. ‘‘చైనా ప్రాదేశిక సార్వభౌమాధికారాన్ని మా బలగాలు గట్టిగా పరిరక్షించాయి. భారత సైనికులు మా భూభాగంలోకి చొరబడటానికి ప్రయత్నించినప్పుడు, మా గస్తీకి అవరోధాలు సృష్టించినప్పుడు గట్టిగా వ్యవహరిస్తున్నాయి’’ అని వ్యాఖ్యానించారు.  
అడ్డుపడుతోంది చైనా బలగాలే: భారత్‌
లిజాన్‌ వ్యాఖ్యలను విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ ఖండించారు. చైనా భూభాగంలోకి భారత బలగాలు చొరబడ్డాయన్న విమర్శలనూ తప్పుబట్టారు. ‘‘నిజానికి భారత గస్తీ బృందాలకు చైనా దళాలే అవరోధాలు సృష్టిస్తున్నాయి’’ అని తెలిపారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు