close

క్రైమ్

ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టుల మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో ఘటన

దుమ్ముగూడెం, న్యూస్‌టుడే: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. దంతెవాడ జిల్లాలోని తుమ్‌నార్‌-నీలవాడ అటవీ ప్రాంతాల మధ్య మావోయిస్టులు సమావేశం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో డీఆర్జీ జవానులు కూంబింగ్‌ చేపట్టారు. ఈ సమయంలో అక్కడ సమావేశమైన కొంతమంది మావోయిస్టులు నేరుగా జవానులపై కాల్పులకు దిగారు. ఈ క్రమంలో చోటుచేసుకున్న ఎదురుకాల్పుల్లో మావోయిస్టు ఫ్లాటూన్‌ నంబర్‌-16 డిప్యూటీ కమాండర్‌ రిసూ ఇష్టమ్‌(40), పిడియాకోటి జనమిలీషియా కమాండర్‌ మాటా(35) తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు మావోయిస్టులు తప్పించుకొని అటవీ మార్గం మీదుగా పారిపోయారు. సంఘటనా స్థలంలో రెండు రైఫిల్స్‌, 5 కిలోల ఐఈడీ పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు