close

బిజినెస్‌

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సన్‌ఫార్మా నష్టం రూ.1,656 కోట్లు

దిల్లీ: ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికానికి సన్‌ఫార్మా ఏకీకృత ప్రాతిపదికన రూ.1,655.60 కోట్ల నికర నష్టాన్ని నమోదుచేసింది. కిందటేడాది ఇదే సమయంలో ఈ ఔషధ సంస్థ రూ.1,387.48 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అనుబంధ సంస్థ టారో ఫార్మాపై అమెరికాలో కొనసాగుతున్న కేసును పరిష్కరించుకునే నిమిత్తం రూ.3,176 కోట్లను కేటాయించడం నష్టాల నమోదుకు కారణమైంది. టారో ఫార్మా కేసు నిమిత్తం కేటాయించిన దానితో కలుపుకొని మొత్తంగా అసాధారణ వ్యయాల రూపంలో రూ.3,633 కోట్ల కేటాయింపులు చేసింది. ఈ మొత్తాన్ని మినహాయిస్తే నికర లాభం రూ.1,146 కోట్లుగా లెక్క తేలుతుందని సన్‌ఫార్మా వెల్లడించింది. సమీక్షా త్రైమాసికంలో ఏకీకృత ఆదాయం రూ.8,374.36 కోట్ల నుంచి తగ్గి రూ.7,585.25 కోట్లకు పరిమితమైంది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు