close

బిజినెస్‌

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
బీఎస్‌-4 వాహనాల రిజిస్ట్రేషన్‌ వద్దు

తదుపరి విచారణ ఆగస్టు 13న

సుప్రీంకోర్టు ఆదేశాలు

దిల్లీ: తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు బీఎస్‌-4 వాహనాలను నమోదు (రిజిస్టర్‌) చేయొద్దని సంబంధిత అధికారులకు సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. లాక్‌డౌన్‌ సమయంలో విక్రయించిన బీఎస్‌-4 వాహనాల అంశాన్ని పరిశీలించి, నిర్ణయం తీసుకున్నాకే ఏ సంగతీ చెబుతామని పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి బీఎస్‌-6 వాహనాలనే విక్రయించాలని సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశించింది. అయితే డీలర్ల కోరిక మేరకు కొవిడ్‌ లాక్‌డౌన్‌ తొలగించాక, దిల్లీ-రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్‌) మినహా దేశంలోని ఇతర ప్రాంతాల్లో 10 రోజుల పాటు మాత్రమే బీఎస్‌-4 వాహనాలు విక్రయించేందుకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు మార్చి 27న ఆదేశాలు జారీ చేసింది. మార్చి ఆఖరి వారంతో పాటు మార్చి 31 తరవాత లాక్‌డౌన్‌ సమయంలోనూ బీఎస్‌-4 వాహనాలను విక్రయించినట్లు గుర్తించడంతో వాహన డీలర్ల అసోసియేషన్‌పై జులై 8న కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. శుక్రవారం దృశ్యమాధ్యమ విధానంలో జరిగిన విచారణలో న్యాయమూర్తి, జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలో న్యాయమూర్తులు జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ కృష్ణమురారి సభ్యులుగా ఉన్న బెంచ్‌ ‘ఈ అంశంపై తేల్చేవరకు బీఎస్‌-4 వాహనాలు రిజిస్టర్‌ చేయొద్దని’ సంబంధిత అధికారులను ఆదేశించింది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు