close

బిజినెస్‌

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అధిక నష్టాల్లో టాటా మోటార్స్‌

ఏప్రిల్‌- జూన్‌లో రూ.8,444 కోట్లు

ముంబయి: టాటా మోటార్స్‌ కార్యకలాపాలపై కరోనా వైరస్‌ తీవ్రంగానే ప్రభావం చూపింది. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో ఈ దిగ్గజ వాహన కంపెనీ నష్టం ఏకీకృత ప్రాతిపదికన మరింతగా పెరిగి రూ.8,443.98 కోట్లకు చేరింది. ఏడాదిక్రితం ఇదే త్రైమాసికంలో రూ.3,679.66 కోట్ల నష్టాన్ని చవిచూసింది. కార్యకలాపాల ద్వారా మొత్తం ఆదాయం రూ.61,466.99 కోట్ల నుంచి తగ్గి రూ.31,983.06 కోట్లకు పరిమితమైంది. స్టాండలోన్‌ పద్ధతిలో కూడా టాటా మోటార్స్‌ నష్టం రూ.2,154.24 కోట్లకు పెరిగింది. కిందటేడాది ఏప్రిల్‌- జూన్‌లో కంపెనీ నమోదుచేసిన నష్టం రూ.147.45 కోట్లు మాత్రమే. స్టాండలోన్‌ ఆదాయం రూ.13,250.19 కోట్ల నుంచి రూ.2,634.14 కోట్లకు తగ్గింది. సమీక్షా త్రైమాసికంలో మొత్తం విక్రయాలు 81.5 శాతం క్షీణించి 25,294 వాహనాలకు పరిమితమయ్యాయి.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు