close

సినిమా

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆ విషయంలో ఇబ్బంది పడ్డా

శ్రుతిహాసన్‌ నటిగా 11 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. ఇన్నేళ్ల ప్రయాణంలో అన్నింటికంటే కూడా నేర్చుకోవడమే ఎక్కువ సంతృప్తినిచ్చిందని చెబుతోందామె. ‘‘మనం నేర్చుకున్నదంతా పరోక్షంగా మన పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. అందుకే నేను బాగా పనిచేశానని చెప్పడం కంటే కూడా బాగా నేర్చుకోవడంపై దృష్టిపెట్టానని, దాన్నే ఎక్కువగా ఆస్వాదించానని చెబుతా. ఆరంభంలో నేనెలాంటి పాత్రలు చేయాలనే విషయంలో చాలా ఇబ్బంది పడ్డా. కానీ ఆ దశని కూడా ఎంజాయ్‌ చేశాను కానీ, ఆ తర్వాత కాస్త వెనక్కి తగ్గాలని నిర్ణయించుకుని మరో మార్గంలో ప్రయాణించా. ఎప్పటికప్పుడు కొత్త మార్గాల్ని ఎంచుకుంటూ ప్రయాణం చేస్తున్నా’’ అంది శ్రుతిహాసన్‌.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు