close

సినిమా

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
21.. 22లో

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా, కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతోంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన శుక్రవారం వెలువడింది. అల్లు అర్జున్‌ నటిస్తున్న 21వ సినిమా ఇది. కొరటాల శివ
స్నేహితుడు సుధాకర్‌ మిక్కిలినేని నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్‌ స్నేహితులు సాండీ, స్వాతి, నట్టి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందనున్న ఈ సినిమా 2022లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు చిత్ర వర్గాలు స్పష్టం చేశాయి. ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ ‘పుష్ప’ సినిమా చేస్తున్నారు. కొరటాల శివ ‘ఆచార్య’ తెరకెక్కిస్తున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత అల్లు అర్జున్‌ - కొరటాల రంగంలోకి దిగనున్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు