close

క్రీడలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఎన్‌బీఏ సందడి షురూ

లేక్‌ బ్యూనా విస్టా (యుఎస్‌): దాదాపు నాలుగు నెలల తర్వాత బాస్కెట్‌బాల్‌ సందడి మొదలైంది. కరోనా కారణంగా మార్చిలో వాయిదా పడ్డ ప్రతిష్ఠాత్మక అమెరికా జాతీయ బాస్కెట్‌బాల్‌ సంఘం (ఎన్‌బీఏ) లీగ్‌ తిరిగి ఆరంభమైంది. వాల్ట్‌ డిస్నీ ప్రపంచంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బయో సెక్యూర్‌ బబుల్‌ వాతావరణంలో భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత మ్యాచ్‌లు జరిగాయి. తొలి మ్యాచ్‌లో ఉటా జాజ్‌ 106-104 తేడాతో న్యూ ఓర్లియాన్స్‌ పెలికాన్స్‌పై, రెండో మ్యాచ్‌లో లాస్‌ ఏంజిలెస్‌ లేకర్స్‌ 103-101తో లాస్‌ ఏంజిలెస్‌ క్లిప్పర్స్‌పై గెలిచాయి. ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’ ఉద్యమానికి మద్దతుగా లీగ్‌ ఆరంభానికి ముందు ఆటగాళ్లు, సిబ్బంది మోకాళ్లపై కూర్చున్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు