close

క్రీడలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
గబ్బర్‌ బ్యాట్‌ పట్టాడు

దిల్లీ: టీమ్‌ఇండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ తిరిగి బ్యాట్‌ పట్టాడు. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌లో కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా  గడిపిన అతను మళ్లీ సాధన మొదలెట్టాడు. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో బ్యాటింగ్‌ చేస్తున్న వీడియోను శుక్రవారం ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.  ‘‘ఈ తీవ్రతను ఇలాగే కొనసాగించాలి. బ్యాట్‌ను బంతి తాకినప్పుడు వచ్చే శబ్దాన్ని ప్రేమిస్తా’’ అనే వ్యాఖ్యతో పోస్టు చేసిన ఈ వీడియోలో అతను మంచి జోరు మీద కనిపించాడు. రివర్స్‌ స్వీప్‌ సహా అన్ని రకాల షాట్లను పూర్తి నియంత్రణతో ఆడాడు. మైదానం నలువైపులా బంతిని పంపించాడు. సెప్టెంబర్‌లో ఆరంభం కాబోతున్న ఐపీఎల్‌ సీజన్‌ కోసం సాధన మొదలెట్టిన ధావన్‌.. తిరిగి లయ అందుకున్నట్లే కనిపించాడు. నిరుడు దిల్లీ క్యాపిటల్స్‌కు ఆడిన అతను 521 ఆకట్టుకున్నాడు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు