close

క్రీడలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
భారత్‌లోనే బాగుంటుంది

దిల్లీ: ఈసారి ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) భారత్‌లో జరగకపోవడం నిరాశ కలిగిస్తోందని ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ అన్నాడు. రాయల్స్‌ ఫ్రాంఛైజీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించిన విలేకరుల సమావేశంలో స్మిత్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘‘భారత్‌లో ఐపీఎల్‌ ఆడటం మాకెంతో నచ్చుతుంది. ఈసారి లీగ్‌ అక్కడ జరగకపోవడం కచ్చితంగా నిరాశ కలిగించే విషయమే. దుబాయ్‌లో పరిస్థితులు భారత్‌కు దగ్గరగానే ఉండొచ్చు. లేదా తేడా ఉండొచ్చు. పరిస్థితులకు తగ్గట్లు అన్వయించుకోవడం కీలకమైన విషయం. 2014లో ఇక్కడ ఐపీఎల్‌ మ్యాచ్‌లు కొన్ని జరిగాయి. చాలామందికి అక్కడ ఆడిన అనుభవముంది. మా జట్టులోనూ కొందరక్కడ ఆడారు. లీగ్‌ చాలా ఉత్సాహభరితంగా ఉంటుందనడంలో సందేహం లేదు’’ అని స్మిత్‌ అన్నాడు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు