close

గ్రేటర్‌ హైదరాబాద్‌

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఎవరు..ఏమన్నారు

మాతృభాషే ప్రథమం

ఐరోపా అంతటా పిల్లలకు చదువులు ప్రారంభమైన తొలినాళ్లలో మాతృభాషలోనే బోధిస్తారు. తర్వాతే ఆంగ్లాన్ని పరిచయం చేస్తారు. భారత్‌లో ఆంగ్లబోధనా సరిగా లేదు. అందువల్ల చాలామేర పిల్లలు బడుల నుంచి బయటకొచ్చిన తర్వాత ఏ భాషనూ అనర్గళంగా మాట్లాడలేకపోతున్నారు.

- తవ్లీన్‌ సింగ్‌, రచయిత్రి


కొవిడ్‌ నివారణ చర్యలేవీ!

అమెరికాలో తొలి కొవిడ్‌ కేసు నమోదై 6 నెలలు అయింది. ఇప్పటికీ వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు సమర్థమైన ప్రణాళికేదీ అధ్యక్షుడు ట్రంప్‌ వద్ద లేదు. నాయకత్వ వైఫల్యంతో రోజూ ప్రజల ప్రాణాలు పోతున్నాయి.

- జో బైడెన్‌, అమెరికా అధ్యక్ష అభ్యర్థి


పేదల ఖాతాల్లో నగదు వేయాలి

ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న సంక్లిష్ట పరిస్థితుల్లో నిరుపేద భారతీయుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నోబెల్‌ గ్రహీతల నుంచి ఆర్బీఐ మాజీ గవర్నర్ల దాకా నిపుణులు చెబుతున్నదిదే.

- కాంగ్రెస్‌ అధికారిక ట్విటర్‌


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు