close

ఆంధ్రప్రదేశ్

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
న్యాయవ్యవస్థను గౌరవించాలి

వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు

ఈనాడు, దిల్లీ: అరవై రోజులు ఆలస్యమైనా రాష్ట్ర ప్రభుత్వం న్యాయ వ్యవస్థను గౌరవించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌(ఎస్‌ఈసీ)గా రమేశ్‌కుమార్‌ పదవిని పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం శుభపరిణామమని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. అధికారులకు శిక్ష పడుతుందనే భయంతో కాకుండా న్యాయ వ్యవస్థను గౌరవిస్తూ నిర్ణయాలు తీసుకోవాలని ఆయన ముఖ్యమంత్రికి సూచించారు. దిల్లీలో శుక్రవారం రఘురామకృష్ణరాజు విలేకరులతో మాట్లాడారు. ప్రపంచంలో ఎక్కడా లేని మద్యం బ్రాండ్లను రాష్ట్రంలో అమ్ముతున్నారని.. వాటితో పోలిస్తే శానిటైజర్లు మేలని తాగి ప్రజలు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా అమ్మే బ్రాండ్లను రాష్ట్రంలో ఎందుకు అమ్మడం లేదో సమీక్షించాలని కోరారు. 

ఆగస్టు 5న అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమిపూజ జరిగే సమయంలో రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలోని 24 వేల ఆలయాల్లో పూజలు, వేద మంత్ర పఠనాలు జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి జగన్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు