close

క్రైమ్

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
చెట్టును ఢీకొన్న కారు.. ఇద్దరు యువకులు మృతి

వికాస్‌రెడ్డి, భార్గవరెడ్డి (పాతచిత్రాలు)

మహేశ్వరం, న్యూస్‌టుడే: విధులు ముగించుకొని ఇంటికి వెళుతుండగా అర్ధరాత్రి కారు అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ పరిధిలోని శ్రీనగర్‌ ఈ-సిటీ రోడ్డులో గురువారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పహాడీషరీఫ్‌ పోలీసుల కథనం ప్రకారం.. కందుకూరుకు చెందిన సురసాని వికాస్‌రెడ్డి(24), సురసాని భార్గవరెడ్డి(19), మహేశ్వరం మండలం గంగారం గ్రామానికి చెందిన జి.అరవింద్‌లు ఈ-సిటీలోని స్కైవర్త్‌ కంపెనీలో పని చేస్తున్నారు. గురువారం రాత్రి విధులు ముగించుకొని ముగ్గురు యువకులు కారులో ఇంటికి వెళ్లేందుకు బయలుదేరారు. ఈ-సిటీ ప్రధాన ద్వారం, హైదరాబాదు-శ్రీశైలం జాతీయ రహదారి కొద్దిదూరం ఉండగానే కారు అదుపుతప్పి చెట్టుకు ఢీకొని పక్కనే ఉన్న గుంతలో పడిపోయింది. కారు నడుపుతున్న వికాస్‌రెడ్డి, పక్కనే ముందు సీట్లో కూర్చున భార్గవరెడ్డిలు అక్కడికక్కడే మృతి చెందగా, వెనుక సీట్లో కూర్చున అరవింద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వికాస్‌రెడ్డి, భార్గవరెడ్డి అన్నదమ్ముల పిల్లలే. చేతికందివచ్చిన కుమారులు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో వారి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. వికాస్‌రెడ్డి కడ్తాల్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడుగా పని చేస్తున్నాడని, పాఠశాలలు మూసి ఉన్నందున ఉపాధి కోసం భార్గవరెడ్డితో కలిసి కంపెనీలో 20 రోజుల క్రితమే విధుల్లో చేరినట్లు వారి మిత్రులు తెలిపారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు