close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
110 పనివాళ్లు...3720 గంటలు!

110 పనివాళ్లు...3720 గంటలు!

జైపూర్‌లో వివాహ వేడుకలు ముగిసిన అనంతరం నిక్యాంక పెళ్లి ఫొటోలు బయటకొచ్చాయి. అందులో ప్రియాంక ధరించిన దుస్తులు, ప్రత్యేకంగా నిలిచాయి. క్రైస్తవ సంప్రదాయం ప్రకారం ధరించిన తెల్లని గౌను అందర్నీ ఆకట్టుకుంది. దానికి తోడు 75 అడుగుల వేల్‌ ధరించింది. అలానే హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన వివాహ వేడుకలో ధరించిన లెహెంగాకూ ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ లెహెంగాను ప్రముఖ డిజైనర్‌ సబ్యసాచి ముఖర్జీ రూపొందించారు. దాన్ని కుట్టు మిషన్‌పై కాకుండా చేతులతోనే తీర్చిదిద్దారు. కోల్‌కతా నుంచి వచ్చిన 110 మంది ఎంబ్రాయిడరీ పనివారు... 3720 గంటల సమయం ఇందుకోసం కేటాయించారట. హ్యాండ్‌ కట్‌ ఆర్గాంజా పూలు, సిల్క్‌ ఫ్రెంచ్‌ నాట్స్‌, సియామ్‌ రెడ్‌ క్రిస్టల్స్‌, త్రెడ్‌ వర్క్‌తో ఈ లెహెంగాను అద్భుతంగా తయారుచేశారు. పెళ్లిలో ధరించిన నగలన్నీ మొఘల్‌ స్ఫూర్తితో రూపొందినవే. అన్‌కట్‌ డైమండ్స్‌, పచ్చలు, జపనీస్‌ ముత్యాలు మేళవించి ఇరవై రెండు క్యారెట్ల బంగారంతో వాటిని డిజైన్‌ చేశారు. ఇందుకు భారీగానే ఖర్చు చేసిందట ప్రియాంక. ఇప్పుడు జోధ్‌పూర్‌కి చెందిన మనోజ్‌ అనే కళాకారుడు నిక్యాంక రెప్లికాను మట్టి బొమ్మలుగా తయారు చేసి... మార్కెట్‌లో ఉంచాడు. వీటికిప్పుడు భలే గిరాకీ.


మరిన్ని