close

ఆదివార అనుబంధం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రాశిఫలం

గ్రహబలం (అక్టోబరు 18 - 24)
డా।। శంకరమంచి రామకృష్ణ శాస్త్రి


ముఖ్యకార్యాలు పూర్తవుతాయి. వృథా వ్యయం తగ్గించాలి. అధికార యోగముంది. పెద్దల ప్రశంసలు ఉంటాయి. కొన్ని సంఘటనలు బాధ కల్గిస్తాయి. మనోనిబ్బరాన్ని కోల్పోవద్దు. అపార్థాలకు తావివ్వకూడదు. సమష్టి కృషి అవసరం. ప్రతి విషయాన్నీ ఇంట్లోవారితో సంప్రదించాలి. ఇష్టదైవాన్ని పూజిస్తే మనశ్శాంతి లభిస్తుంది.


మంచి కాలం నడుస్తోంది. కోరుకున్న జీవితం లభిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతి ఉంది. వ్యాపారంలో కలసివస్తుంది. మంచి భవిష్యత్తు ఉంది. గృహ, భూ, వాహన యత్నాలు సఫలమవుతాయి. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. కొందరి ప్రవర్తన ఇబ్బందికరంగా ఉంటుంది. వారాంతంలో కార్యసిద్ధి ఉంది. శివారాధన మంచి ఫలితాన్నిస్తుంది.


మర్థతతో విజయం సాధిస్తారు. ముఖ్యకార్యాల్లో అప్రమత్తత అవసరం. వారం మధ్యలో శుభం జరుగుతుంది. మిత్రుల సలహాతో సమస్య పరిష్కారమవుతుంది. ఉద్యోగంలో స్వస్థాన ప్రాప్తి ఉంది. వ్యాపారంలో నష్టం వాటిల్లకుండా చూడాలి. మొహమాటంతో సమస్యలొస్తాయి. కుటుంబసభ్యుల సలహాలు అవసరం. ఇష్టదైవాన్ని ధ్యానించండి, శక్తి పెరుగుతుంది.


కాలం అంతగా సహకరించడంలేదు. పనులు జరగాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. తెలియని విషయాల్లో జోక్యం పనికిరాదు. ఆర్థికంగా మంచి కాలం నడుస్తోంది. పట్టుదలగా పనిచేస్తే గొప్ప స్థాయికి చేరగల సూచనలు ఉన్నాయి. కోరికలు క్రమంగా సిద్ధిస్తాయి. ఉద్యోగంలో అధికారుల ఒత్తిడి ఉంటుంది. వ్యాపారంలో బాగుంది. లక్ష్మీ ఆరాధన మంచిది.


దృష్టవంతులవుతారు. గ్రహస్థితి అద్భుతంగా ఉంది. ఒత్తిళ్లు తగ్గుతాయి. భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రతిభను ప్రదర్శిస్తారు. పదవీ లాభముంది. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. ధనధాన్య లాభం ఉంది. వస్తు, వాహన ప్రాప్తి సూచితం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్మరణ శుభప్రదం.


నేక విఘ్నాలు ఎదురవుతాయి. ఓర్పుగా ముందుకు సాగాలి. వారం మధ్యలో శుభం జరుగుతుంది. వ్యాపారంలో లాభముంది. ఉద్యోగపరంగా కొత్త సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడాలి. మేలు చేయబోతే కీడు ఎదురవుతుంది. పోయినవి తిరిగి లభిస్తాయి. భాంధవ్యాలు బలపడతాయి. నవగ్రహస్తుతి ఉత్తమం.


త్తమ ఫలితముంది. అధికార లాభం సూచితం. కృషి ఫలిస్తుంది. విఘ్నాలను సునాయాసంగా అధిగమిస్తారు. బంధుమిత్రుల సలహాలు పనిచేస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మిశ్రమ ఫలితం ఉంటుంది. ఆర్థికంగా కొన్ని ఆటంకాలుఉంటాయి. సమాజంలో కీర్తి లభిస్తుంది. అపార్థాలకు అవకాశం లేకుండా వ్యవహరించాలి. ఇష్టదైవ స్మరణ మేలుచేస్తుంది.


నుల్లో ఆలస్యం అవుతుంది. ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలి. మిత్రుల అండ అవసరం. కుటుంబసభ్యుల సూచనలు పనిచేస్తాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. ముఖ్యకార్యాల్లో శ్రద్ధ పెంచాలి. ఆర్థికంగా సమస్య ఉంటుంది. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. వ్యాపారంలో స్వల్ప విఘ్నాలున్నాయి. ఇష్టదైవారాధన శ్రేయస్సునిస్తుంది.


టుచూసినా విజయమే గోచరిస్తోంది.  బ్రహ్మాండమైన భవిష్యత్తు లభిస్తుంది. ఉద్యోగంలో ఉత్తమ స్థితి ఉంటుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. శత్రుదోషం తొలగుతుంది. గృహలాభం సూచితం. శుభవార్త వింటారు. గణపతిని స్మరిస్తే మంచిది.


శుభాలున్నాయి. కర్తవ్యాన్ని నిర్వర్తించండి. కోరుకున్న ఫలితం వెంటనే వస్తుంది. బంగారు భవిష్యత్తును సాధిస్తారు. బంధుమిత్రుల అండదండలు లభిస్తాయి. ఉద్యోగంలో గుర్తింపు ఉంటుంది. వ్యాపారంలో స్వల్ప ఆటంకాలు రావచ్చు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. లక్ష్మీ ఆరాధన శుభాన్నిస్తుంది.


ర్మమార్గంలో లక్ష్యాన్ని సాధిస్తారు. అదృష్ట యోగం ఉంది. ముఖ్యకార్యాల్లో తిరుగులేని ఫలితం సొంతమవుతుంది. ప్రతి అడుగూ ఆలోచించి వేయండి. చిన్న పొరపాటు జరిగినా సమస్య పెద్దది అవుతుంది. సొంత నిర్ణయం లక్ష్యాన్ని చేరుస్తుంది. ఆలస్యమైనా మంచి ఫలితం వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త. ఆంజనేయస్వామి ప్రార్థన మనశ్శాంతినిస్తుంది.


ష్టాలు దూరమవుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మొహమాటం వల్ల ఇబ్బందులు రాకుండా చూడాలి. ఆర్థికంగా సమస్య ఉంటుంది. అవమానాలను తట్టుకుని లక్ష్యాన్ని సాధించాలి. ఉద్యోగ వ్యాపారాల్లో జాగ్రత్త అవసరం. అపార నష్టం  సూచితం. మానవ ప్రయత్నంతోనే ఉపద్రవాల నుంచి బయట పడతారు. ఇష్టదేవతను స్మరించాలి. శక్తి లభిస్తుంది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు