close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
చలికాలంలో బంతి, చామంతి...! 

చలికాలంలో బంతి, చామంతి...! 
కాలాన్ని బట్టి మొక్కల ఎదుగుదల ఆధారపడి ఉంటుంది.  అందుకే ఈ శీతాకాలంలో చక్కగా ఎదిగే పూల మొక్కల్ని ఎంచుకుందాం. తగిన జాగ్రత్తలూ తీసుకుందాం. అవేంటంటే!

చలికాలంలో బంతి, చామంతి...! 

* గులాబీ, బంతి, చామంతి, సీతమ్మవారి జడ గంటలు వంటి పూల మొక్కలు ఈ కాలంలో విరివిగా పూస్తాయి. పిటూనియా, ఆంథూరియం, సినరేరియా, జినియా, కాల్యెండులా పెంచుకునే ప్రదేశానికి కొత్తందం తెస్తాయి. వీటిని ఈ కాలంలో ఎంచుకోవచ్చు. 
* మొక్కల్ని ఎంచుకునేటప్పుడే అవి పెరిగే తీరు, కావలసిన పోషకాలు వంటివీ తెలుసుకోవాలి. ఒకేలా పెరిగే వాటిని ఫెయిరీ గార్డెన్‌ తరహాలో సక్యులెంట్స్‌ వంటి ఇతర జాతి మొక్కలతో కలిపి నాటుకోవచ్చు. వీటిని కానుకల్లానూ ఇవ్వొచ్చు. 
* మొక్కల్ని కొన్నాక వాటికి తగ్గ వాతావరణాన్ని కల్పించాలి. అంటే మట్టిని సారవంతంగా మార్చుకోవాలి. అవసరాన్ని బట్టి తేమ అందేలా, మట్టి పొడిగా ఉండేలా చూసుకోవాలి. 
*  పూల మొక్కల్ని కుండీల్లో నాటాలనుకుంటే కనీసం ఐదు అంగుళాల లోతులో నాటుకోవాలి. అందుకు తగ్గట్లు కుండీ ఏడెనిమిది అడుగుల లోతు ఉండేలా చూసుకోవాలి. 
* ఈ కాలంలో మొక్కల్లో ఎదుగుదల కొంచెం నెమ్మదిగా ఉంటుంది. నేరుగా ఎండ తగిలే ప్రదేశాల్లో కుండీలను అమర్చుకోవడం మేలు. అప్పుడే ఆరోగ్యంగా, పచ్చగా ఎదుగుతాయి. క్రమం తప్పకుండా 19:19:19 నిష్పత్తిలో ఎన్‌పీకే ఉండే సమగ్ర ద్రవరూప ఎరువుని మొక్కకి అందించాలి. చీడపీడలు దరిచేరకుండా ప్రతి పదిహేను ఇరవై రోజులకు ఒకసారి సబ్బునీళ్లను స్ప్రే చేయడం మంచిది. అలానే వేప నూనె, వెల్లుల్లి కషాయం వంటివాటినీ తగినంతగా అందించాలి.

చలికాలంలో బంతి, చామంతి...! 


మరిన్ని