close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
బదిలీ అడిగా... మోసం చేశానని అనుకుంటారా?

*మూడు నెలల క్రితం ఉన్నతస్థానాన్ని కోరుతూ బదిలీ చేసుకునే అవకాశం వచ్చింది. ఎవరికీ తెలియకుండా దరఖాస్తు చేసుకోవాలి. అలానే చేశా. బదిలీ అవుతాననే ఆత్మవిశ్వాసం, నమ్మకం ఉండేది. తీరా చూస్తే... నేను అనుకున్నట్లు జరగలేదు. అది నాకు షాకే. అయితే ఈ విషయం నా బాస్‌తో సహా సహోద్యోగులకు తెలిసిపోయింది. ఎలా అనేది తెలియదు. ఇప్పుడు వారి మాటతీరు మారిపోయింది. బదిలీ ప్రయత్నించి వారిని మోసం చేసినట్లుగా చూస్తున్నారేమోనని అనిపిస్తోంది. ఈ సందర్భాన్ని ఎలా ఎదుర్కోవాలి.. .                                                - ఓ సోదరి

బదిలీ అడిగా... మోసం చేశానని అనుకుంటారా?

ఆఫీసులో ఎవరికీ తెలియకుండా ఉన్నతస్థానానికి బదిలీ చేయాలంటూ దరఖాస్తు చేసుకోవడమనేది బాస్‌, సహోద్యోగలకన్నా ముందుండాలనుకోవడమే. మీరిప్పుడు అదే చేశారు. ఇలా రహస్యంగా బదిలీ అడగడం కొంత క్లిష్టమైనదే. ఇలా చేసేటప్పుడు ముందుగా మీ శ్రేయోభిలాషులు, మీపై అధికారులతో చర్చించి ఉండాల్సింది. అలాగే మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఆ తరువాతే మీరీ పని చేయాల్సింది. ఇప్పటికీ మించిపోయింది లేదు. దరఖాస్తు చేసుకున్నా అది రాలేదనే విషయాన్ని మీ బాస్‌కు తెలియజేయండి. వాళ్లందరితో కలిసి పనిచేయడం సంతోషమని చెప్పండి. మీ సహోద్యోగుల బృందానికి దూరంగా వెళ్లే ఆలోచన లేదని స్పష్టం చేయండి. అవకాశం ఉంది కాబట్టే ప్రయత్నించాననీ, తప్పించుకోవడానికి కాదని వాళ్లకు అర్థమయ్యేలా చెప్పండి. ఇకపై మీరు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలి. ప్రస్తుతం మీరున్న స్థానంలో మీ సామర్థ్యాలను పెంచుకునేలా ప్రయత్నించాలి. తరువాత వాటితో ఉన్నతస్థానానికి వెళ్లడానికి ప్రయత్నించవచ్చా అనేది మీ బాస్‌నే అడగొచ్చు. అయితే మీ పై అధికారి చర్చించినప్పుడే ఆ విషయాలు ప్రస్తావించాలి. ఇప్పుడు ఉన్న స్థానంలో మీరు సాధించిన విజయాలు, విధుల పట్ల మీరెంత నిబద్ధతతో ఉంటారనే విషయాన్ని తెలియజేయండి. గతంలో అవకాశం వచ్చినప్పుడల్లా మీ సామర్థ్యం, ప్రతిభను మీరు నిరూపించుకుంటూనే ఉన్నారనేదీ చెప్పాలి. మీ బాస్‌ మీకు చేయూతగా ఉండాలనుకుంటే మీకు సిఫారుసు చేసే అవకాశం ఉంటుంది. ఆచీతూచీ వ్యవహరించడం మంచిది.
                                                                              - మీ సందేహాలను, సమస్యల్ని vasucareer@eenadu.netకు పంపించగలరు.


మరిన్ని