close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
తెలుపుతో బాధపడుతున్నా!

నేను వైట్‌ డిశ్ఛార్జితో బాధపడుతున్నా. ముఖ్యంగా నెలసరి పూర్తయిన వారం తరువాత నుంచి ఈ సమస్య ఎదురవుతోంది. పైగా జననాంగాల దగ్గర దురద కూడా ఉంటోంది. ఆకలీ వేయట్లేదు. అలాగే నెలసరి వచ్చి వారం తరువాత వక్షోజాల్లో నొప్పి కూడా ఉంటోంది. ఈ సమస్యలకు ఏదయినా పరిష్కారం ఉందా?                       - ఓ సోదరి

తెలుపుతో బాధపడుతున్నా!వక్షోజాల్లో నొప్పి, వైట్‌డిశ్ఛార్జి అనేవి రెండు వేర్వేరు సమస్యలు. మీలో కొన్నిరకాల విటమిన్లు, ట్రేస్‌ఎలిమెంట్ల లోపం, హార్మోన్ల అసమతూకం ఉన్నా ఇలా నెలసరి సమయంలో ఆ తరువాత కూడా వక్షోజాల్లో నొప్పి రావచ్చు. దీన్ని ప్రీమెన్‌స్ట్రువల్‌ సిండ్రోమ్‌ (పీఎంఎస్‌) అని అంటారు. వైద్యుల దగ్గరకు వెళ్తే... వక్షోజాలను పరీక్షిస్తారు. ఏ ఇబ్బందీ లేదనుకుంటే పై లోపాల్ని అంచనా వేసి... తదనుగుణంగా చికిత్స సూచిస్తారు. ఇక, మీకు ఉన్న మరో సమస్య వైట్‌డిశ్ఛార్జి. దాంతోపాటు దురద కూడా బాధిస్తోందంటే అది వెజైనల్‌ ఇన్‌ఫెక్షన్‌కి సంకేతం కావచ్చు. దీన్ని కూడా నిర్లక్ష్యం చేయకపోవడమే మంచిది. పాప్‌స్మియర్‌తోపాటు కల్చర్‌ సెన్సిటివిటీ పరీక్ష చేయించుకుంటే అది బ్యాక్టీరియల్‌/ఫంగల్‌/వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ అనేది తెలుస్తుంది. దానికి అనుగుణంగా యాంటీబయోటిక్స్‌తోపాటు ఇతర మాత్రలు వాడితే సమస్య అదుపులోకి వస్తుంది. అయితే భార్యాభర్తల్లో ఒకరికి ఇన్‌ఫెక్షన్‌ వచ్చినా రెండోవ్యక్తి కూడా చికిత్స తీసుకుంటేనే ప్రయోజనం ఉంటుంది. కాబట్టి ఇద్దరూ చికిత్స తీసుకోవాలి. అలాగే సమస్య నయం అయ్యేవరకూ కలయికకు దూరంగా ఉండాలి లేదా కండోమ్స్‌ తప్పనిసరిగా వాడాల్సి ఉంటుంది. కాబట్టి వైద్యుల్ని సంప్రదించడం మంచిది. 
- మీ సందేహాలను, సమస్యల్ని ‌vasuhealth@eenadu.net కు పంపించగలరు.


మరిన్ని