close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
విల్లులా వంచేద్దాం
ఒకేసారి భుజాలు, ఛాతీ, నడుము కిందిభాగం తీరైన ఆకృతిలోకి మారాలన్నా...ఆ కండరాలు దృఢంగా ఉండాలన్నా....  ఇవి చేసి చూడండి. 

ట్రయాంగిల్‌ ట్రిమ్మర్‌ 

విల్లులా వంచేద్దాం

నేలమీద కూర్చుని కుడికాలిని వెనక్కి మడవాలి. ఎడమకాలి అరి పాదాన్ని కుడికాలి తొడలోకి దూర్చాలి. కుడిచేతిని పైకెత్తాలి. ఎడమచేతిని కుడి చెంపకు ఆనించాలి. తల కిందకు పెట్టాలి. ఇలా ఎనిమిదిసార్లు చేశాక కాళ్లు, చేతులు మార్చి మరో ఎనిమిదిసార్లు చేయాలి.  
లాభాలు: నడుము కిందిభాగం, పిరుదులు, తుంటి కండరాలకు వ్యాయామం అందుతుంది. 

బటర్‌ఫ్లై బెండ్‌  

విల్లులా వంచేద్దాం

కుడికాలిని వెనక్కి, ఎడమకాలిని ముందుకు పెట్టాలి. చేతుల్ని వెనక్కి తెచ్చి రెండింటినీ కలపాలి. చేతుల్ని అలాగే సాగదీస్తున్నట్లుగా ఉంచి... స్క్వాట్స్‌ చేస్తున్నట్లుగా కాళ్లను వంచేందుకు ప్రయత్నించాలి. కావాలనుకుంటే మోకాలిని నేలకు ఆనించొచ్చు. ఒకసారి చేసి పైకి లేచాక మరో ఏడుసార్లు చేయాలి. తరువాత మళ్లీ కాళ్లు మార్చి ఎనిమిదిసార్లు చేయాల్సి ఉంటుంది.  
లాభాలు: నడుము కిందిభాగానికి, ఛాతీకి, పొట్టకు మేలుచేస్తుంది వ్యాయామం. ఆ భాగాల్లో పేరుకొన్న కొవ్వు కరగడంతోపాటు అవి తీరైన ఆకృతిలోకి వస్తాయి.

విల్లులా వంచేద్దాం


మరిన్ని