close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
తెలుసా సమంత తీర్మానాలు!

కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టే ముందు చాలామంది ఏవేవో తీర్మానాలు చేసుకుని.. వాటిని అవలంబిస్తుంటారు. మరి ఈ ఏడాది సమంతా అక్కినేని ఏమని తీర్మానించుకుందో తెలుసా! 

తెలుసా సమంత తీర్మానాలు!

‘క్రిస్మస్‌ తరువాత వచ్చే పండగ కొత్త సంవత్సరం తొలి రోజు. ఆ రోజంతా చాలా సంతోషంగా ఉంటా. అప్పుడే ఏడాదంతా ఆ ఉత్సాహం సొంతమవుతుంది. అలానే నేను 2019లో ఎలా ఉండాలో మూడు తీర్మానాలు చేసుకున్నా. వాటిలో మొదటిది గొప్పగా, ఉన్నతంగా ఉండాలి. రెండోది సాటివారిపట్ల మరింత సానుభూతి కలిగి ఉండాలి. మూడోది పూర్తిగా శాకాహారం మాత్రమే తీసుకుంటూ శాంతిని, సంతోషాన్ని పంచాలి. ఈ మూడు తప్పక పాటిస్తా. ఇలా ఏటికి ఏడు ఏవో కొన్ని సానుకూల గుణాలను పెంచుకుంటూ వెళ్తున్నా. మరి ఈసారి మీ సంగతి...’ అని అంటూనే  సమంత ఈ విషయాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది.


మరిన్ని