close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఫొటోల్లో సహజంగా

ఫొటోలు మన జీవితంలో మధుర జ్ఞాపకాలు. ప్రతి సందర్భాన్నీ ఒడిసిపట్టుకోవాలని ప్రయత్నిస్తాం. దానికి తగ్గట్లే దుసులు,  వాటికి నప్పే నగలు అన్నీ ఎంచుకున్నా అలంకరణ విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
* మనకు నచ్చినట్లుగా మేకప్‌ వేసుకోవడంతోనే అందం వచ్చేయదు. అలంకరణ చేసుకున్నా ముఖం సహజ అందంతో మెరవాలి. కుదిరితే ముందురోజు చర్మంపై పేరుకున్న మృతకణాలు, మురికిని పూర్తిగా తొలగించుకోవాలి. మర్నాడు మరోసారి శుభ్రం చేసుకుని మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. అవసరం అనుకుంటే దానిపై కొద్దిగా ప్రైమర్‌నీ రాసుకోవచ్చు.
* చర్మతత్వానికి నప్పే ఫౌండేషన్‌నే ఎంచుకోవడం మంచిది. అప్పుడే సహజ అందం సొంతమవుతుంది. వీలైనంతవరకూ మెరిసే అలంకరణ కాకుండా మ్యాటీ రకాన్ని ఎంచుకోవడం మంచిది. ముఖం అందంగా కనిపించేందుకు కనుబొమల ఆకృతిని కూడా తీర్చిదిద్దుకోవాలి. కళ్లు అలసిపోయినట్లు కనిపిస్తూ, ఎర్రగా ఉంటే తెలుపు రంగు ఐలైనర్‌ని వేసుకోవాలి.  దీన్ని వాడటం వల్ల కళ్లు కాస్త పెద్దగా, తాజాగా కనిపిస్తాయి.
* మిగిలిన సందర్భాల్లో సన్‌స్క్రీన్‌ రాసుకుంటున్నా... ఇలాంటప్పుడు మాత్రం వద్దు. జిడ్డు చర్మతత్వం ఉన్నవారికి అలంకరణ చేసుకోగానే ముఖం మెరుస్తున్నట్లు కనిపిస్తుంది. ఫొటోలకు ఆ మెరుపు పనికిరాదు. దానికి బదులుగా అలంకరణ అంతా పూర్తయ్యాక కొద్దిగా మ్యాటీపౌడర్‌ని అద్దుకుంటే చాలు. ముఖం మరీ మెరుస్తున్నట్లు కనిపించదు. అది అందుబాటులో లేకపోతే గనుక కొన్ని టిష్యూలు దగ్గర పెట్టుకుని అప్పుడప్పుడూ  అద్దుకుంటే చాలు.


మరిన్ని