close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
పెళ్లయ్యాక తోడుగా...

పెళ్లంటే జీవితాంతం కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా కలిసి నడవాలి.  కానీ మారుతోన్న పరిస్థితులు, ఒత్తిడి వంటి వాటివల్ల చిన్న విషయాలకే చిర్రుబుర్రులాడుకుంటున్నారు.  అలాకాకూడదంటే...!
*పెళ్లి అనే పేరుతో ఒక్కయ్యాక కూడా నా, నీ అనుకోవడం వల్ల గొడవలు మొదలవుతాయి. అలాకాకుండా కలిసి తీసుకునే నిర్ణయాలు, ఒకరికోసం మరొకరు ఆలోచించి చేసే పనులు ఇద్దరినీ ఒక బాటలో నడిపిస్తాయి. ఇది మీ మధ్య బంధాన్ని బలపరుస్తుంది.
* పొరబాట్లు సహజం...అవి ఇద్దరిలో ఎవరివల్లైనా జరగొచ్చు. ప్రతి సమస్యనూ మీ వైపే కాకుండా ఎదుటివారి కోణం నుంచి కూడా ఆలోచించడానికి ప్రయత్నించండి. కానీ తప్పుని ఒప్పుకోవడానికి ఇలాంటప్పుడు అహం అడ్డొస్తుంది. సమస్యను మరింత జటిలం చేస్తుంది. ఒకరి మీద మరొకరు తప్పులు వేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్య సర్దుబాటు అవుతుంది.
* భార్యాభర్తల మధ్య గొడవలు సహజం. గతం జోలికి అస్సలు వెళ్లొద్దు. ఎప్పటి గొడవలు అప్పుడే పరిష్కరించుకుని వదిలేసుకోవడం వల్ల అవి పెరిగి పెద్దవి కావు. అన్యోన్యంగా ఉండగలుగుతారు.
* మీ మధ్య బంధం మరింత బలపడాలంటే...ముందు మీ జీవనశైలిలో కొన్నిమార్పులు తప్పనిసరిగా చేసుకోండి. ఇద్దరూ కలిసి ఎక్కువ సమయం గడిపేలా చూసుకోండి. రోజూ ఒకపూటైన కలిసి భోజనం చేయడం, ప్రత్యేక సందర్భాలను గుర్తుపెట్టుకుని సెలబ్రేట్‌ చేసుకోవడం, విహారయాత్రలకు వెళ్లడం వంటివన్నీ చేయండి.


మరిన్ని