close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ప్లాస్టిక్‌ సీసాలే పూలకుండీలు!

నీళ్లు, శీతలపానీయాల సీసాలు వాడేసిన తరువాత పడేస్తాం. అలాకాకుండా మనసు పెట్టి ఆలోచిస్తే వాటితో వైవిధ్యమైన కళాకృతుల్ని, అలంకరణ వస్తువుల్ని రూపొందించొచ్చు.  మరి అందుకేం చేయాలంటే...

పెన్సిల్‌ బాక్స్‌లా... పెద్ద సీసాను తీసుకుని రెండు భాగాలుగా కోయాలి. పెద్ద భాగంలో పెన్సిళ్లు, పెన్నుల వంటివి వేసుకోవచ్చు. కావాలనుకుంటే చిన్న భాగాన్ని మూతలా వాడుకోవచ్చు.

కుండీల్లా... స్థలం తక్కువగా ఉండేవారు కొత్తిమీర, గడ్డిగులాబీ, పుదీనా లాంటివాటిని పెంచుకోవచ్చు. అందుకోసం ప్లాస్టిక్‌ సీసా మధ్య భాగంలో కత్తిరించి మట్టిని నింపి మొక్కల్ని నాటుకుంటే చాలు. వీటిని వేలాడదీసినా అందంగా ఉంటాయి.

వాజులా... కాస్త సన్నగా చక్కని ఆకృతిలో ఉండే బాటిల్‌ని తీసుకోవాలి. గుండ్రటి చిన్న బంతిని తీసుకుని దాన్ని కత్తిరించుకుని సీసా మూతికి తగిలించాలి. దాన్ని పెయింటింగ్‌తో అమ్మాయి తలలా తీర్చిదిద్దుకోవాలి. ఇప్పుడు లేసు, ఫ్లోరల్‌క్లాత్‌ తీసుకుని కిందిభాగంలో డ్రెస్‌లా కట్టి పిన్నులు పెట్టాలి. చివరిగా తల కింది భాగంలో నిలబడేలా క్యాండిల్‌ హోల్డర్లని తగిలిస్తే సరి. అలంకరణ కోసం ఎక్కడ పెట్టుకున్నా అందంగా కనిపిస్తుంది.


మరిన్ని